బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతం విద్యార్థులతో తో కలిసి భోజనం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఇప్పటివరకూ లేని విధంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అందించటం ఎంతో ఉపయోగం అన్నారు. పలువురు అధికారులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.