బాపట్ల జిల్లాలో 0 నుండి 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలందరికి ఆల్బెండజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో పిల్లలకు నులిపురుగుల మందులను పంపిణీ చేయాలని చెప్పారు.