బాపట్ల పట్టణంలో శుక్రవారం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ చీలు రోడ్డు సెంటర్ నుండి జమ్ములపాలెం ఫ్లైఓవర్ డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు జాతీయ భావం ఉట్టిపడేలా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.