నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణానికి చెందిన షేక్ ఖాదర్ వలీ అనే వ్యక్తి మంగళవారం బాపట్ల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడుతుండగా ప్రజలు అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు స్పందించి అతన్ని కాపాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బాపట్ల వచ్చి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోబోయేడని రైల్వే పోలీసులు తెలిపారు. సూసైడ్ చేసుకోవడానికి ఇంకా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.