బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని ప్రధాన రహదారి తుంగభద్ర కాలువ వంతెన పై శనివారం ఉదయం తెల్లవారుజామున అశోక్ లైలాండ్, టిప్పర్ వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో. ముగ్గురు కు తీవ్ర గాయాలయ్యాయి. పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కర్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.