ఉమ్మడి గుంటూరు - కృష్ణ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గురువారం బాపట్ల మండలం నందిరాజుతోట గ్రామంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.