విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీస్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాలులో డిపిఓలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్యాప్తు అధికారి పోక్సో, మహిళ సంబంధిత కేసులలో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులలో అభియోగ పత్రం దాఖలు చేయాలన్నారు.