బాపట్లలో పల్లెనిద్ర కార్యక్రమం

70చూసినవారు
బాపట్లలో పల్లెనిద్ర కార్యక్రమం
బాపట్ల పట్టణంలోని ఐదవ వార్డులో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ సిఐ రాంబాబు స్థానిక ప్రజలతో మమేకమై చట్టాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు తెలియచెప్పారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్