చిలకలూరిపేట మండలం నాగభైరవారి పాలెం గ్రామంలో శుక్రవారం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అప్పారావు మరణించగా వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలానే కార్యకర్తల కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ప్రతి కార్యకర్తకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని ప్రత్తిపాటి పేర్కొన్నారు.