ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం తిరుమల స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బ నాయుడు నేతృత్వంలో ఎడ్లపాడు సబ్ ఇన్‌స్పెక్టర్ శివ రామకృష్ణ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో కార్మికులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం దుష్పరిణామాలు, మహిళలపై జరిగే నేరాలు వంటి సమాజానికి హానికరమైన అంశాలపై కార్మికులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.