విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: వేణుగోపాలరావు

82చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: వేణుగోపాలరావు
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావు ఆదేశించారు. బుధవారం చిలకలూరిపేట మండలంలోని కోమిటినేని వారి పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్