చీరాలకు చెందిన పలువురు కౌన్సిలర్లు మాజీ మంత్రి పాలేటి రామారావు పై మంగళవారం బాపట్లలోని కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ వెంకట్ మురళికి వినతి పత్రం అందజేశారు. గడియార స్తంభం వద్ద కలెక్టర్ అనుమతి లేకుండా కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గత రాత్రి శంకుస్థాపన చేశారని వారు కలెక్టర్ కు వివరించారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు.