నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో శనివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్యతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరణం లేని మహా నేత ఎన్టీఆర్ అని వారు ఈ సందర్భంగా కొనియాడారు.