చీరాలలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్ యాకోబు పాల్గొని మాట్లాడారు. దోమ కాటు వలన డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్నచోట లార్వా ఏర్పడి దోమలు వృద్ధి చెందుతాయని డాక్టర్ యాకోబు తెలియజేశారు.