చీరాల: వీఆర్వో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

74చూసినవారు
చీరాల: వీఆర్వో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చీరాలలోని సిపాయిపేట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన వీఆర్వో భాష కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినగా విఆర్ఓ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆగి ఉన్న కారును బస్సు ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్