చీరాల మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ వివాదం

57చూసినవారు
చీరాల మున్సిపాలిటీలో చైర్మన్, కమిషనర్ మధ్య వివాదం రాజుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరుడైన తన చేత కాకుండా ఎమ్మెల్యే కొండయ్య చేత ప్రోటోకాల్ కు భిన్నంగా కమీషనర్ చక్రవర్తి జాతీయ జెండాను ఆవిష్కరింపచేశారని చైర్మన్ శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఇందుకోసం కమిషనర్ తమకు ఇచ్చిన టైం షెడ్యూల్ నే మార్చేశారన్నారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తామని, వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్