గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పులి శ్రీనివాసరావును సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.