గుంటూరు మున్సిపల్ సమావేశంలో జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులును పరుష పదజాలంతో దూషించడం దుర్మార్గమని రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి ఉప్పుటూరి పేరయ్య, వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్య దర్శి పొదిలా వాసు అన్నారు. గుంటూరులో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ పై అనుచిత వాఖ్యలు చేసిన డిప్యూటి మేయర్ డైమండ్ బాబు, దానిని సమర్థించిన మేయర్ మనోహర్ తక్షణమే కమిషనర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.