గుంటూరు జీఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. నగర ప్రజలు, లైసెన్స్డ్, ఇంజినీర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.