విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సి. వి రేణుక అన్నారు. గుంటూరు పాతబస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాయ్స్ స్కూల్లో శనివారం జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డీఈవో ప్రారంభించారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ప్రదర్శనలను జిల్లాస్థాయికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని చెప్పారు.