గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో శనివారం జరిగిన రగడలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తప్పున్నట్లు తనకు అనిపించలేదని నగర మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. తమాషా అనేది సర్వసాధారణమైన పదమని, ఒకవేళ అది తప్పనిపిస్తే రికార్డుల నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించడం మంచిది కాదన్నారు. లంచ్ తర్వాత కూడా అధికారులకు, కమిషనర్ కు తాను కాల్ చేసినా కౌన్సిల్ కు రాలేదన్నారు.