గుంటూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీ నుంచి డీటీపీ, 20 నుంచి టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ కుమార్ సోమవారం తెలిపారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఓల్డ్ బ్యాంకు వీధి, కొత్తపేటలో టైలరింగ్లో 30రోజులు, డీటీపీలో 45 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 19-45 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు.