గుంటూరు: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

58చూసినవారు
గుంటూరు: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. గురువారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్