ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. మార్చి 17 వరకు మేయర్, డిప్యూటీ మేయర్లు ఉన్నా చేసేదేమీ లేదని పునరాలోచన చేయాలని చెప్పిన క్రమంలో మేయర్ స్పందించారు. బుధవారం గుంటూరులో మేయర్ మాట్లాడుతూ అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని, వైసీపీ జెండాతో గెలిచిన మేము చివరి వరకు వైసీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ మారిన కార్పోరేటర్లు బాధపడాల్సిన రోజు వస్తుందని అన్నారు.