కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నూతనంగా అంబులెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై అంబులెన్స్ని ప్రారంభించారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అంబులెన్స్ ను నడిపారు. ఉచితంగా ఏర్పాటు చేసిన అంబులెన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.