గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల వసతీ గృహంలో శనివారం లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్ళా మాధవీ పాల్గొని బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధానాలు పథకాలు అందించి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.