గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో ఈనెల 27, 28 రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు సదస్సు డైరెక్టర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. సురేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం సదస్సు బ్రోచర్ను వైస్ ఛాన్సలర్ కే. గంగాధరరావు ఆవిష్కరించారు. 'నాన్ ఫిక్షన్. లిటరేచర్ ఇన్ ఉర్దూ ఇంగ్లీష్ అండ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్' అనే అంశంపై యూజీసీ సహకారంతో సదస్సు జరుగుతుందన్నారు.