గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ధూమపానం చేస్తే రూ. 200 జరిమానా తప్పదని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. వి. ఎస్. బి. జి పార్థసారథి హెచ్చరించారు. కోర్టు ఆవరణలో శనివారం పార్థసారథి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టిఫిన్, టీ స్టాల్స్ లో సిగరెట్లు విక్రయిస్తున్నారా? అని ఆరా తీశారు. కోర్టు ఆవరణలో సిగరెట్లు విక్రయిస్తే దుకాణాలు తొలగిస్తామన్నారు. అనంతరం కోర్టులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.