గుంటూరు నగరంలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యటించారు. కొత్తపేట, ఉమెన్స్ కాలేజ్, శంకర్ విలాస్ సెంటర్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ వెంట ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, సీఐ అశోక్ సింగయ్య, ఎస్ఐలు ఉన్నారు.