అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహారం అందలేదని ఫిర్యాదులు రాకుండా, డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది చూడాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం మిర్చి యార్డు వద్ద అన్న క్యాంటీన్ ను జీఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు.