మేదరమెట్ల: స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం

71చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి స్వచ్ఛ ఆంధ్రపై ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాధా మాధవి పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్రాలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్