రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లు శుక్రవారం పున: ప్రారంభమయ్యాయి. ఐదు రూపాయలకే అందిస్తున్న భోజనాన్ని తినేందుకు జనం బారులు తీరుతున్నారు. క్యాంటీన్ ల మెనూ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటి భోజనం మరిపించే విధంగా నాణ్యత ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్ లో ఐదు రూపాయలకి ఏమి దొరకటం లేదని, పేదల ఆకలని తీర్చేందుకు నిరంతరం అన్న క్యాంటీన్ లు కొనసాగించాలన్నారు