గుంటూరు నగరంలోని ఏ. టీ అగ్రహారంలో మెయిన్ రోడ్, డ్రైనేజ్ మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9. 45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఏటీ అగ్రహారంలోని అన్ని లైన్లు, శాంతి నగర్, బండ్ల బజారు, ఆకుల వారి తోట ప్రాంతాలలో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.