కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజా ఆదివారం గుంటూరు కొరిటపాడు వాకింగ్ ట్రాక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్ ను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని కొనసాగించడానికి తన గెలుపునకు కృషి చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.