గుంటూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో సోమవారం ఉదయం 9.30 నుంచి 10:30 వరకు 0863-2224202 నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చన్నారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.