జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మేయర్ మనోహర్ సూచించారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ చూపిన అహింసా మార్గాన్ని యావత్ ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు.