గుంటూరులో ఈనెల 10వ తేదీలోపు శానిటరీ డివిజన్ల వారీగా ట్రేడ్ లైసెన్స్ లపై ఇన్స్ స్పెక్టర్ సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ప్రజారోగ్య విభాగ అధికారులతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుద్ధ్య పనులపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ లైసెన్సులు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని చెప్పారు. పూర్తి వివరాలతో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.