గుంటూరు శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. సచివాలయ కార్యదర్శులు ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాద్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన ఆర్జీ మేరకు సదరు కాలనీ, నల్లపాడు చెరువు, ఏటుకూరు రోడ్ కంపోస్ట్ యార్డ్ ప్రాంతాల్లో పర్యటించారు.