కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్ల సంక్షేమానికి కృషి చేయాలని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్స్ అసోసియేషన్ ముద్రించిన 2025కు సంబంధించిన క్యాలెండర్ ను గురువారం జంగాల గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పెంటర్ల సమస్యలను విస్మరించిందన్నారు.