గుంటూరు శారద కాలనీకి చెందిన కళ్యాణ్, శ్రీనాధ్ అనే ఇద్దరు యువకులు శారద కాలనీ ఆర్చీ సెంటర్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో అడ్డుకున్న ఆ బాలిక చిన్నమ్మతో గొడవ పెట్టుకొని దుర్భాషలాడారు. ఈ ఘటనపై బాలిక తల్లి సోమవారం అరండల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.