గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు 10వ తేదీలోపు నామినేషన్లు సమర్పించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. 13వ తేదీన స్క్రూటీని అదే రోజు సాయంత్రం అభ్యర్ధుల ప్రకటన జరుగుతుందని చెప్పారు. 27న ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. మార్చి 3 నుంచి 8 వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు.