గుంటూరు నగరంలోని రహదారులకు ప్యాచ్ వర్క్ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరిటెపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను గురువారం కమిషనర్ తనిఖీ చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.