గుంటూరు జిల్లాలో అన్నీ పోలీస్ స్టేషన్లకు సంబంధించి న్యాయ స్థానాల్లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని, ఆ ప్రక్రియకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా అదనపు ఎస్పీ కె. సుప్రజ సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్ల అమలును వేగవంతం చేసి, ముద్దాయిలను కోర్టులో హాజరు పరచాలని అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం సుప్రజ కోర్టు కానిస్టేబుల్స్ తో మాట్లాడారు.