మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టారని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ గుర్తుచేశారు. గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్లో గురువారం మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ పాల్గొని మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మౌనముని అని ప్రశంసించారు.