ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై న్యూఢిల్లీ నుంచి సంఘం అధికారులు మంగళవారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.