గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో రూ. 18 కోట్లతో పెట్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత పనులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఉగాది నాటికి పెట్ సిటీ అందుబాటులోకి వస్తుందన్నారు. నాట్కో సమన్వయకర్త అశోక్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.