గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్ధులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.