గుంటూరు నగరంలో శంకర్ విలాస్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్'నిర్మాణ సమయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారులకు ట్రాఫిక్ మళ్లింపునకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనరు శ్రీనివాసులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.