మానవ జీవితంలో ప్రతి ఒక్కరి ఉన్నతికి చదువే ప్రామాణికమని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరు అరండల్ పేటలోని బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ చేశారు. నేటి పోటీ ప్రపంచంలో చదువు ఆవశ్యకతను గుర్తు చేశారు. వసతి గృహంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు.