రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కళాశాల విద్యార్థుల కోసం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం గుంటూరు ఉమెన్స్ కాలేజ్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అతిథిగా హాజరై మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.